కలయే కవితై

                                              కలయే కవితై

                                రచయిత ఆర్. మల్లికార్జున రెడ్డి 


కృతజ్ఞతలు 

నన్ను ప్రేమగా పెంచి నా గమ్యం దిశకు ఏ మాత్రం అడ్డు చెప్పకుండా నన్ను ఎల్లా వేళల సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ వస్తున్నా నా తల్లి తండ్రులకి మరియు నా సోదరునికి నా జీవితాంతం రుణపడి ఉంటాను

                                                                                                                          
ప్రోత్సాహం

నేను బుక్ రాస్తున్నప్పుడు నన్ను ప్రోత్సహించిన నా మిత్రులు సాయి కృష్ణ, శివ ప్రసాద్, వెంకటేష్, నాగు అన్న మరియు ఇంకొంత మంది మిత్రులందరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ.......

విశ్వాంతర సృష్టిలోనైన, బ్రహ్మాంతర సృష్టిలోనైన
కలియుగ అంతరాలలోనైనా, ఖగోళ అంతరిక్షంలోనైన
దివిలోనైనా, భువిలోనైన
కాతికుంపటిలోనైనా, కారుమేఘాలలోనైనా, బంధుమిత్రులలోనైనా
సాటిలేని బంధం ఉంది అంటే అది మిత్ర బంధం ఒక్కటే

                                                                                                                  
అంకితం

నా మొదటి కవిత సంపుటిని మా నూతన వధూవరులైన సాయికృష్ణ మరియు సింధూరి లకు అంకితం చేయటం జరిగినది


ముఖ్య గమనిక 

కవితానుసారంగా కవితలను మూడు భాగాలుగా అభివర్ణించడం జరిగినది.
1 . కవితలు
2 . విజయ కెరటాలు
3 . అనుబంధం


                                                                                                                        మీ ప్రియమైన
                                                                                                                        ఆర్ . మల్లికార్జున రెడ్డి


కవితలు


పుస్తకంలో ఎన్ని పేజీలు వున్నా,
జీవితంలో ఎన్ని కష్టాలు వున్నా,
పేజీలను చింపుకుంటూ పోతుంటే పుస్తకం ఖాళీ అవుతుంది
కష్టాలు తుడుచుకుంటూ పోతుంటే జీవితం శూన్యం అవుతుంది.



జనన మరణాలను సృష్టించేది ఎవరు,
పంచ భూతాలను సృష్టించేది ఎవరు ,
పాప కర్మ లెక్కలను చూసేది ఎవరు , 
నీ అంతరాత్మలో ఉండే భగవంతుడు అనుకునే నీ ఆత్మ.



నాగలి పట్టినవాడు భూమిని  దున్నుతాడు,
కలం పట్టిన వాడు భూప్రపంచాన్ని దున్నుతాడు,
ఒకరు మనిషి ఆకలి తీరుస్తే, మరొకరు మనిషి కష్టాలు తీరుస్తారు

నాగలి పట్టినవాడు భూమిని  దున్నుతాడు,
కలం పట్టిన వాడు భూప్రపంచాన్ని దున్నుతాడు,
ఒకరు మనిషి ఆకలి తీరుస్తే, మరొకరు మనిషి కష్టాలు తీరుస్తారు

ఎగిరే గాలి పటం
ఎగరడానికి ప్రయత్నించే పక్షి పిల్ల
ఎగురుతాయో లేదో అని ఆలోచించవు
అలా ఆలోచిస్తే పక్షి పిల్లను ఆకాశంలో చూడలేం.

క్షణం క్షణం ఒక జీవితం
ప్రతి క్షణం ఒక వేదిక
మనసే ఒక అతుకుల బొంత
బొంతలో కలవు ఎన్నో సమస్యల వింత.  


భరతమాత బిడ్డ భారతీయుడా
ఎదుటివాడి విజయం నీకు ఎందుకురా !
దరిద్రం ని వెంట ఉంటే అష్ట దేవతలైన ఏమి చేయలేరు అనే   
మూడనమ్మకాన్ని వదిలి పెట్టరా  విజయ బాట కోసం దారివెతకరా...


పదిమందిని పలుకరించే వ్యక్తి కనపడని యెడల
పది మందిలో ఎవరో ఒకరు వెతుకకపోరా
పోయేది ఏముంది మిత్రమా ఒక మాట ఎదుటవారిని చిరునవ్వుతో పలకరించి చూడు
పలకరింపే నీ విజయబాటకి మార్గం కూడా అవ్వొచ్చు .

ఎన్ని సిరులు వున్నా  
ఎంత అందం వున్నా
నీ శరీరంతో తప్ప
నీ ఆత్మ తోడు రావుగా ...

జన్మనిచ్చింది  ఒక్క  అమ్మ
మరణం ఇచ్చింది పరమాత్మా అనే ఒక బొమ్మ.


ఎంత కష్టం ఉన్న మొఖంఫై చిరునవ్వు  చూపించే వ్యక్తికి
భయం అనే మాటకి ఆమడ దూరంలో  ఉండే వ్యక్తికి
మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందేమో మిత్రమా ...


ప్రతి క్షణం ఒక అద్భుతం
ప్రతి జీవితం ఒక గమ్యం
గమ్యం మనకు దారి చూపించదు
మనం వేసే  ఒక్కో అడుగు గమ్యం వైపు దారిచూపిస్తుంది.


అగ్గి పెట్టెలాంటి జీవితాన్ని వెలిగిస్తే
కొవ్వొత్తిలాంటి కాలం వెలుగును ఇస్తుంది
జీవితం , కాలం రెండు కలిసినా చివరికి మిగిలేది బూడిదే సోదరా ....


నీ నీడ నిన్ను చూసి ఎక్కిరించిన రోజున నువ్వు  ఒక
బండరాయితో సమానం మిత్రమా ...


పక్కన వున్న సొంత బంధువు కన్నా
దూరంగా ఉన్న పాత స్నేహితుడే మిన్న

విజయ కెరటాలు


నీ వెనుక ఏముంది నీ ముందు ఏముంది అని ఆలోచించే నీ ఆత్మను అడుగు నీలో ఏముందో చెప్తుంది .

ఒకడు మౌనంగా  ఉన్నాడు అంటే ఖాళీగా ఉన్నాడని కాదు అర్ధం వాడు ప్రపంచానికి ఎలా పరిచయం అవ్వాలని ఆలోచిస్తున్నట్టు.


కష్టం లేని చోట ఇష్టంగా జీవించటం ఎవరివల్ల సాధ్యం కాదు మిత్రమా !

భయం ఉన్న చోటనే పతనం వుంటుంది
భయం ఉన్న చోటనే పాపాలు కూడా ఎక్కువగా వుంటాయి.
భయం ఉన్న చోటనే  కర్మలు  కూడా వుంటాయి
భయం ఉన్న చోటే ప్రతి పని తప్పుగా వుంటుంది 
భయాన్ని ప్రాలదోలండి విజయకేతాన్ని ఎగురవేయండి.


నీ ముందు సమస్య ఉందని ఒక్క అడుగు వెనక్కి వేస్తే,
నీ వెనుక 100 సమస్యలు కాచుకొని వుంటాయి.


నిన్ను నమ్మిన వాడిని మోసం చేసిన
నీకు సహాయం చేసినవాడిని మరచిపోయిన
నిన్ను ప్రేమించిన వారిని మరచిపోయిన
మరొక జన్మలో నిన్ను ఎవరైనా మోసం చేయవచ్చు , మరచిపోవచ్చు , పట్టించుకోకపోవచ్చు.


ప్రపంచ సిరులను ఆస్వాదిస్తూ నీ జీవితంలో కష్టాలను అదిగమిస్తూ 
భువి నుంచి ధివికి నీ పేరు మారుమ్రోగేదాక
నువ్వు ఒక్కో మెట్టు ఎక్కుతూ పదిమందికి సాయపడిన రోజేకదా
నీలో కూడా ఒక పరమాత్ముడు ఉన్నాడని గ్రహించేది ...


ప్రవహించే నది ఎండిన
పచ్చగున్న ఆకు వాడిన
మనసు బాధ చావుకు దారి తీసిన
ప్రతి శబ్ధం భయపెట్టాలని చూసిన
కటిక చీకటి కారుమబ్బులు వెంటాడిన
ప్రతి క్షణం ప్రతి నిమిషం నా మనసు ఎదుటవాడి సంతోషం  కోసం తాపత్రయ పడుతుంది .


పది మందిని ప్రేమగా పలకరించి
అందరితో కలసిపోతూ
నాలుగు దిక్కులు సిగ్గుపడేలా
ఓటమిని ఎరుగక ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటున్న  నేస్తం ఒక్కడున్నా  చాలు .

అనుబంధం

ధైర్యంలో ఉండే జీవితం భయంలో ఉండదు
ప్రేమలో ఉండే జీవితం ఒంటరితనంలో ఉండదు.


నీలో ఉండే నీ ఆత్మనే  నీ పరమాత్మ
నీ ఆత్మతో మాట్లాడు నీ బాధ ఏమిటో తెలుస్తుంది.
నీ ఆత్మతో మాట్లాడు నీకు ఒక కొత్త మిత్రుడు పరిచయం అయినట్టు అనిపిస్తుంది.


స్నేహాన్ని మించిన బంధం లేదు
ప్రేమను మించిన అనుబంధం లేదు.


కష్టం నీ ముందు ఉందని కాటికి వెళ్ళడానికి ఇష్టపడొద్దు
నీ ప్రాణం కంటే నీ ముందు వుండే కష్టం పెద్దదే౦ కాదు


బయటపడే  అమ్మ ప్రేమ కన్నా
బయటపడని నాన్న ప్రేమ మిన్న ...


బంధువు అని చేరదీయకు
భార్య అని  చెప్పి అన్ని చెప్పకు
ఎదో  ఒకరోజు నీ పీకకు తాడులా మేకై కూర్చోక మానవు.


తప్పు చేశానని బాధ పడకు
తప్పు దిద్దుకోవడానికి మార్గం వెతుకు.


మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు మన చుట్టూ బంధువులే
మనకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రం మన చుట్టూ అందరు శత్రువులే ...


ప్రేయసి మాటవిని మోసపోకు
పరాయివాడి మాట విని స్నేహితుడిని దూరం చేసుకోకు
భార్య మాట విని తల్లిదండ్రులను తప్పు పట్టకు
ప్రతి మాట నమ్మేముందు పదిసార్లు ఆలోచించి చూడు.


ప్రేమగా జీవించే వ్యక్తిని
పవిత్రంగా ఉండే వ్యక్తిని
నిజాయితిని తన ప్రాణంగా భావించే వ్యక్తిని
ప్రపంచంలో పంచభూతాలు కూడా ఏమి చేయలేవు.


విషపు పాము కుడితే ఒక్క క్షణంలో చచ్చెదము
విషపు మనిషి తోడైతే జీవితాంతము  వారిచేత చంపబడుతూ ఉండెదము...


************************************************
అందరికి నమస్కారం నా రెండవ నవల (మదిలో మౌనం) బుక్ నెక్స్ట్ ఇయర్ అనగా 2018 లో బుక్ అందరికి అందుబాటులో ఉంటుంది అని తెలియజేయడం జరిగినది .

                                                     
                                                                                            మీ
                                                                        ఆర్.మల్లికార్జున రెడ్డి (r.m.r)


కామెంట్‌లు